పదిమంది కొత్త నటుల రిక్వెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వారా పది మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నామని, యూత్‌ఫుల్ ట్రెండీ ఫిలిమ్‌గా టెక్నికల్ హై స్టాండర్డ్స్‌లో సినిమాను రూపొందించామని తెలిపారు. తాను అనుకున్నదానికన్నా ఎన్నో రెట్లు అవుట్‌పుట్ బాగా వచ్చిందని, దర్శకుడిగా తనకు పేరు తెస్తుందని ఆయన అన్నారు. సోషల్ మీడియాకు యువత ఎలా బానిసలుగా మారుతున్నారు? దానివల్ల ఏర్పడే అనర్థాలు ఏమిటి? అనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించామని, ప్రస్తుతం యువత ఆలోచనలు, అభిరుచులకు అద్దంపట్టేలా రూపొందిన ఈ సినిమా అన్ని అంశాల్లోనూ స్పెషల్‌గా ఉంటుందని ఆయన అన్నారు. టైటిల్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోందని, జూన్ నెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. సీతల్, మనీషాకేల్కర్, రీచాసోని, సాగరిక చైత్రి, ప్రకాష్, రోహిత్, నితేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: రాఘవ, సంగీతం: లవన్, వీరన్, కెమెరా: సిద్ధార్థ్, నిర్మాణం: మోడరన్ సినిమా, కథ, దర్శకత్వం: ఆదిత్య ఓం.