బాలీవుడ్ దర్శకుడితో రాజకీయ చిత్రం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో నిరుత్సాహానికి గురైనాడు. మొత్తంమీద అందులోంచి బయటకు వచ్చిన పవన్ మళ్లీ కొత్త ఉత్సాహంతో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. తన కెరీర్‌లో ‘ఖుషి’లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాతోపాటు దాసరి నారాయణరావు నిర్మించే సినిమా కూడా చేయడానికి డేట్స్ ఇచ్చాడు. దాంతోపాటు పవన్‌తో సినిమా చేసేందుకు ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది. ఇటీవలే ఆయన పవన్‌ను కలవడానికి వచ్చాడని, ఇప్పటికే పవన్‌కోసం కథ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. రాజకీయాల నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. మరోవైపు అతనితో చర్చలు జరిపేందుకు కూడా పవన్ ఆసక్తిగా ఉన్నాడట. మొత్తానికి బాలీవుడ్ దర్శకుడితో పవన్ త్వరలోనే సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది.