హరీష్‌శంకర్‌తో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కి ‘గబ్బర్‌సింగ్’ ఎంత ప్రత్యేకమైన సినిమానో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన అభిమానులు ఎంతోకాలంపాటు ఎదురుచూసిన హిట్‌ని దర్శకుడు హరీష్‌శంకర్ ఈ సినిమాతో అందించారు. అలాంటి హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్‌లో తాజాగా మరో సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘వేదాళం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని, తమిళంలో ఈ సినిమాను నిర్మించిన ఏ.ఎం.రత్నం తెలుగులోనూ రీమేక్ చేసే ఆలోచనతో ఈ కాంబినేషన్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈమధ్యే విడుదలైన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో అభిమానుల్ని మెప్పించలేకపోయిన పవన్, తదుపరి చేయబోయే సినిమాలు అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ఉండాలన్న ఆలోచనతో హరీష్‌శంకర్‌తో సినిమాను సెట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.