అందరికీ నచ్చే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో హీరోయిన్‌గా పరిచయమై రెండు, మూడు చిత్రాల్లో నటించిన శ్రీదివ్యకు ఇక్కడ అనుకున్న క్రేజ్ దక్కలేదు. దాంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తమిళంలో తెలుగమ్మాయిలకు మంచి క్రేజ్ వున్న దృష్ట్యా ఆమె పలు చిత్రాల్లో నటిస్తూ మంచి విజయాలు అందుకుంటోంది. తాజాగా శ్రీదివ్య నటిస్తున్న చిత్రం ‘రాయుడు’. విశాల్ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ‘మరుదు’ పేరుతో తమిళంలో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో శ్రీహరి వెంకటేశ్వరా పిక్చర్స్ పతాకంపై జి.హరి ‘రాయుడు’పేరుతో అందిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా శ్రీదివ్యతో ఇంటర్వ్యూ:
పవర్‌ఫుల్ పాత్ర
ఇందులో భాగ్యలక్ష్మి అనే పాత్రలో కనిపిస్తాను. చాలా బోల్డ్‌గా వుండే పాత్ర అది. పల్లెటూరి అమ్మాయిగా వుంటూనే సెకెండాఫ్‌లో పెళ్లైన గృహిణిగా మెచూర్డ్ పాత్రలో కనిపిస్తాను. నటనకు చాలా ప్రాధాన్యత వున్న పాత్ర ఇది. ఈమధ్య చాలా సినిమాల్లో హీరోయిన్లకు అంత ప్రాధాన్యత వుండడంలేదు. తమిళంలో మాత్రం ప్రాముఖ్యతను ఇస్తున్నారు.
మొదట్లో భయమేసింది
విశాల్‌తో సినిమా అనగానే మొదట్లో కొంచెం భయపడ్డాను. కానీ, ఆయన చాలా ఫ్రెండ్లీగా వుంటారని తెలుసుకున్నా. హీరోలా ఫీలవకుండా యూనిట్‌లోని అందరితో చాలా సరదాగా వుంటాడు. హీరోగా కంటే కూడా మంచి మనిషి. సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తుంటారు. తమిళనాడులోని రాజుపాలెంలో టాయిలెట్స్ లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలిసి యూనిట్ తరఫున విశాల్ టాయిలెట్స్ కట్టించారు.
అందరికీ కనెక్ట్ అవుతుంది
ఈ సినిమా కథ ముఖ్యంగా అమ్మమ్మ, మనవడి మధ్య సాగే సెంటిమెంట్‌తో వుంటుంది. ఈ పాయింట్ తెలుగువారికి బాగా నచ్చుతుందనుకుంటాను.
తమిళ్ నేటివిటీ ఇష్టం
నాకు మొదటినుంచీ తమిళ సినిమాలంటే బాగా ఇష్టం. అక్కడ సినిమాలు నేటివిటీకి, మంచి కథలకు ప్రాధాన్యత ఇస్తారు.
తెలుగులో కూడా
తెలుగులో కూడా మంచి సినిమాలు చేయాలనుంది. కేరింత తరువాత ఏ సినిమా చేయలేదు. ప్రస్తుతం తమిళంలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఒప్పుకుంటున్నాను. త్వరలోనే తెలుగులో సినిమాతో వస్తా.
తదుపరి చిత్రాలు
కార్తి సరసన కాష్మోరా సినిమాలో నటిస్తున్నాను. ఇందులో నయనతార కూడా వుంది. జీవా హీరోగా మరో సినిమా కూడా చేస్తున్నాను. ప్రస్తుతానికైతే తెలుగులో ఇంకా ఏ సినిమా ఓకె చేయలేదు.

-శ్రీ