సందేశాత్మకంగా వేటపాలెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా హని, ప్రణి ఫిలిమ్స్ పతాకంపై నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో ఎ.వి.ఆర్. రూపొందించిన చిత్రం ‘వేటపాలెం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఎ.వి.ఆర్. మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథను నమ్మి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, గతంలో వచ్చిన దండుపాళ్యం చిత్రం గుర్తుకు వస్తుందన్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఈ నెల 27న విడుదల చేసి, జనవరి మొదటివారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలుచేస్తున్నామన్నారు. అనాధ పిల్లలు ఎటువంటి పరిస్థితులను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు? వారి భవిష్యత్ ఎలా ఉండబోతుంది? వారు పెద్దయ్యాక దుండగులుగా ఎలా మారుతున్నారు? అనే అంశంతో క్రైమ్ కథనంతో మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందిందని దర్శకుడు నంది వెంకట్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎ.ఎం.రెడ్డి, మున్నా, శిల్ప తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: ఎ.ఆర్.సన్ని, పాటలు: నర్ల రామకృష్ణారెడ్డి, మాటలు: గణేష్ ముత్యాల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నంది వెంకట్‌రెడ్డి.