తండ్రీ కొడుకుల ఆట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్ కథానాయకుడి శ్రీ నాగ్, శ్రీ జి ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందించిన చిత్రం ‘ఆటాడుకుందాం రా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ- తండ్రీ కొడుకుల కథనం ప్రధానంగా సాగే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రంలో కథానాయకుడికి ఏ సమస్య వచ్చినా తెలివిగా డీల్ చేసే విధానం అందరికీ నచ్చుతుందని, తండ్రీకొడుకులమధ్య ఎమోషనల్ సీన్లు కంటతడి పెట్టిస్తాయని తెలిపారు. సుశాంత్‌కి వందశాతం యాప్ట్ అయ్యే ఈ కథనంలో బ్రహ్మానందం బృందం కామెడీ హైలెట్‌గా వుంటుందని, ముఖ్యంగా టైం మెషిన్ సెట్ వేసి చిత్రీకరించిన సన్నివేశాలన్నీ కడుపుబ్బ నవ్విస్తాయని ఆయన తెలిపారు. నాగ్ కార్పొరేషన్‌లో మూడు సినిమాలు కొత్త దర్శకులతో చేశామని, ఈ చిత్రాన్ని నాగేశ్వర్‌రెడ్డితో రూపొందించామని, మాటల రచయిత శ్రీ్ధర్ శీపాన సంయుక్త కలయికలో ఈ చిత్రం అద్భుతంగా రూపొందిందని తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. సోనమ్‌ప్రీత్ బజ్వా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, వెనె్నల కిశోర్, రఘుబాబు, పృధ్వీ, ఫిరోజ్ అబ్బాసి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీశ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా:దాశరధి శివేంద్ర, కథ, మాటలు:శ్రీ్ధర్ శీపాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జి.నాగేశ్వర్‌రెడ్డి