మెరిసిన సోనమ్ విరిసిన మల్లిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం సినిమా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ‘కేన్స్’ చిత్రోత్సవంలో నిర్వహించే ఛారిటీ షోలోనూ పలువురు తారలు పాలుపంచుకున్నారు. ఎయిడ్స్ నివారణ, పరిశోధనలు, ప్రచార కార్యక్రమాలకు కావలసిన నిధులు సమకూర్చేందుకు ఏటా కేన్స్‌లో ‘ఎఎంఎఫ్ ఎఆర్’ (అమెరికన్ ఫౌండేషన్ ఫర్ ఎయిడ్స్ రీసెర్చ్) గాలా పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈసారి ఈ కార్యక్రమాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ నటుడు లియొనార్డొ డి కాప్రియొ ప్రారంభించగా బాలీవుడ్ తారలు సోనమ్‌కపూర్, మల్లికా షెరావత్‌సహా పలువురు హాలీవుడ్ తారలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో వీరు వినూత్నమైన దుస్తుల్లో అలరించారు. బంగారు జరీతో అల్లిన తెల్లటి దుస్తుల్లో సోనమ్ మెరిసిపోతే, ఊదారంగు దుస్తులతో మల్లిక ఆకట్టుకుంది. ఇక హాలీవుడ్ తారలు పెయిర్స్‌హిల్టన్, కటెపెరి , ఎల్లెఅన్నింగ్, పాలిహిల్టన్‌సహా మరెందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో ఈ గాలాలో ఐశ్వర్యరాయ్‌ కూడా పలుసార్లు పాలుపంచుకున్నారు.

చిత్రం మల్లికా షెరావత్‌, సోనమ్‌కపూర్