అందరినీ ఆకట్టుకునే చుట్టాలబ్బాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, నమితా ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీస్ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమాకు సంబంధించిన కథ, కథనాలు సరికొత్తగా వుంటాయని, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపొందించామని, ఆదికి తనకు సూపర్‌హిట్‌గా నిలుస్తుందని అన్నారు. శంషాబాద్ టెంపుల్‌లో క్లైమాక్స్ సన్నివేశాలను పూర్తిచేశామని, విలన్ జాన్ కొక్కిన్ నటన హైలెట్‌గా వుండనుందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, రఘుబాబు, కృష్ణ్భగవాన్, అభిమన్యుసింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, గిరిధర్, అనితానాధ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:తమన్, కెమెరా:ఎస్.అరుణ్‌కుమార్, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, మాటలు:్భవానీ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వీరభద్రమ్.