యధార్థ సంఘటనల పోలీస్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ జొన్నలగడ్డ, నందినికపూర్, ధరణి ప్రధాన పాత్రల్లో సర్వేశ్వరా మూవీస్ పతాకంపై గుద్దేటి బసవప్ప మేరు నిర్మాతగా శివ జొన్నలగడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పోలీస్ పవర్’. ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో, దర్శకుడు శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ‘కాల్‌మనీ’ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను సిద్ధం చేశామని, ఇప్పటికే 50 శాతం షూటింగ్ చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. నిర్మాత బసవప్ప మాట్లాడుతూ, తాను రిటైర్డ్ పోలీస్ అధికారినని, డిపార్ట్‌మెంట్‌లో వున్నప్పటినుంచీ పోలీస్ పవర్ అంటే ఏమిటో చూపించాలనుకున్నానని, ఇన్నాళ్లకు శివ చెప్పిన కథ బాగా నచ్చిందని, ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలుంటాయని, ఈ చిత్రాన్ని పోలీస్ అమరవీరులకు అంకితమిస్తూ పోలీస్ డే అక్టోబర్ 21న విడుదల చేస్తామన్నారు.