తెలంగాణ తొలి నిర్మాత ఆర్.కె.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సినిమాలు రూపొందించినందుకుగాను తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్ అందుకున్న ఆర్.కె.గౌడ్‌ను అభినందిస్తున్నామని, తెలంగాణ సినిమా పరిశ్రమ పెద్దగా ఆయనను గౌరవిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఆర్.కె.్ఫలింస్ పతాకంపై దాదాపు 30 సినిమాలు రూపొందించి ప్రపంచ సినిమా అవార్డు గ్రహీత ఆర్.కె.గౌడ్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా సత్కరించారు. తెలంగాణలో సినీ పరిశ్రమ వెనుకబడి వుందని, అందుకు ముఖ్యమంత్రి పరిశ్రమ గురించి ఆలోచించాలని, పూణెలో వున్న ఫిలిం ఇనిస్టిట్యూట్ తరహాలో హైదరాబాద్‌లో నెలకొల్పాలని పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. కళకు హద్దులుగాని, బాషాభేదాలు లేవని, తెలంగాణ సినీ పరిశ్రమ అన్ని హద్దులు దాటుకుని మంచి చిత్రాలు రూపొందించాలని రామచంద్రుడు అన్నారు. తాను నిర్మాతగా రూపొందించిన సినిమాలన్నీ పక్కా ప్రణాళికలతోనే చేశానని, ఇపుడు రూపొందించడానికి అలాంటి పరిస్థితులు లేవని సన్మాన గ్రహీత ఆర్.కె.గౌడ్ తెలిపారు. థియేటర్ల కొరత నిర్మాతలను బాధిస్తోందని, ఇందుకోసమే సరికొత్త తరహాలో మినీ థియేటర్ల రూపకల్పన చేయనున్నామని, దానివల్ల నిర్మాతకు మేలు జరుగుతుందని, కొత్త కొత్త సినిమాలు రూపొందించడానికి నిర్మాతలు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.