జాహ్నవీ.. తొందరొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి గూర్చి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీదేవి ఇద్దరు కూతుళ్లలో పెద్దదైన జాహ్నవి ఇప్పుడు సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధవౌతోంది. తల్లి శ్రీదేవి ఇప్పుడే వద్దని వారిస్తున్నా అక్కడక్కడ తన తెరంగేట్రానికి సంబంధించిన విషయాలను జాహ్నవి చెబుతూనే వుంది. ప్రస్తుతం శ్రీదేవి మామ్ చిత్రంలో నటిస్తూ షూటింగ్ కోసం జార్జియ వెళ్లింది. జాహ్నవి అక్కడికి కూడా వెళ్లి తల్లితోపాటుగా అనేక ఫొటోలను విడుదల చేసింది. శ్రీదేవి మాత్రం ఇంకా జాహ్నవి చదువుకోవాలంటూ చెబుతోంది. కొంతమంది నిర్మాతలు సరాసరి జాహ్నవి దగ్గరికే వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా కూతురును ఇప్పుడే నటించవద్దంటూ చెబుతోందట శ్రీదేవి! చివరికి గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడిస్తుందో ఏమో?