హద్దులు చెరిగిపోయాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2001లో ‘ఇష్టం’ సినిమాతో సినీ రంగం ప్రవేశం చేసిన ఢిల్లీ భామ శ్రీయకు సంతోషం సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి, మెప్పించింది. స్వతహాగా డాన్సర్ అయిన ఆమె తాజాగా ‘ఊపిరి’లో నాగ్‌కు జోడిగా నటించారు. ఇటీవల అవకాశాలు బాగా తగ్గినప్పటికీ టైమ్స్‌మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో ఈ ఏడాది శ్రీయ ఆరో స్థానంలో నిలవడం విశేషం. హీరోయిన్‌గా దాదాపు 15 సంవత్సరాల లాంగ్ ఇన్నింగ్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అన్న ప్రశ్నకు శ్రీయ సమాధానం ఇస్తూ ‘మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ పెరిగాక ఆర్ట్ సినిమాకు, కమర్షియల్ చిత్రానికి మధ్య ఉన్న అంతరం బాగా తగ్గిపోయింది. అందుకే కథానాయిక ప్రాధాన్యం వున్న చిత్రాలు పెరుగుతున్నాయి’ అని చెప్పింది. ప్రస్తుతం సింబు తెలుగులో వచ్చిన ‘ఉలవచారు బిరియాని’, హిందీ రీమేక్ ‘తడ్కా’లో నానాపటేకర్ సరసన నటిస్తోంది. అందుకే ఆర్ట్ సినిమాకు, కమర్షియల్ సినిమాకు ఉన్న రూల్స్ చెరిగిపోతున్నాయని చెబుతోంది.