మెగా సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిరంజీవి నటించబోయే 150వ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళేందుకు రంగం సిద్ధవౌతోంది. మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు వి.వి.వినాయక్ రచయితల బృందం ఇప్పటికే స్క్రిప్ట్‌ను పూర్తిచేయగా, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి, త్వరలో సెట్స్‌పైకి తీసుకువెళ్ళేలా సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంకోసం చిరంజీవి ఇమేజ్‌కి సరిపడేలా కథలో మార్పులు చేర్పులు చేశారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాకు కత్తిలాంటోడు అనే పేరును ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు.