బ్రహ్మోత్సవం మొదట వద్దనుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించారు. మహేష్‌తో ఇప్పటికే ‘బిజినెస్‌మెన్’ సినిమా చేసిన కాజల్, మళ్లీ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించడం సంతోషంగా వుందని అంటోంది. ఆమెతో ఇంటర్వ్యూ విశేషాలు...
మహేష్‌తో సినిమా ఎలా వుంది?
‘బిజినెస్‌మెన్’ అప్పటితో పోలిస్తే మహేష్ ఇప్పుడింకా యంగ్ అయిపోయారు. విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక నటుడిగా ఒక్కో సినిమాకూ ఎదుగుతూ వెళ్ళడం కూడా మహేష్‌ను చూసి నేర్చుకోవాలి. ఇక ఒక స్టార్‌తో కలిసి మళ్లీ నటించేప్పటికి ఇద్దరికీ ఒక రాపో కుదిరి ఉంటుంది. ఈ సినిమా విషయంలో మహేష్ చాలా సపోర్టుగా నిలిచారు. మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా క్యూట్‌గా వుంటుంది. ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పేరులోనే చెప్పినట్లు, ఇదో ఉత్సవంలాంటి సినిమా. శ్రీకాంత్ అడ్డాల రాసిన అద్భుతమైన కథే ఈ సినిమాకు మేజర్ హైలెట్. ఈ సినిమాలో నేను ఓ ఎన్నారై అమ్మాయిగా కనిపిస్తా. మామూలుగా మన సినిమాల్లో ఎన్నారై అమ్మాయి అంటే ఆ పాత్రకు కాస్త అతి జోడించి చూపిస్తుంటారు. శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఈ కారెక్టర్‌ను చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఈ తరం ఆలోచనలు, స్వతంత్ర భావాలున్న అమ్మాయి పాత్రలో నటించడం చాలా కొత్తగా కనిపించింది.
కధలో నచ్చిన అంశం ఏమిటి?
నిజానికి శ్రీకాంత్ ఈ కథ చెప్పినపుడు చేయాలా వద్దా అని ఆలోచించా. నాకున్న అనుమానాలన్నీ తీర్చుకున్నాక, ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయి చేసేశా. ఇలాంటి స్వతంత్ర భావాలున్న అమ్మాయి పాత్రలో నేను ఇదివరకు నటించలేదు. దీంతో ఈ రోల్ నాకు చాలా స్పెషల్. శ్రీకాంత్‌గారు చాలా కూల్ అండ్ సింపుల్. ముందే చెప్పినట్టు, కథ చెప్పినప్పటిదగ్గర్నంచే నాకు ఈ పాత్రపై చాలా అనుమానాలు ఉండేవి. అయితే ఆయన నాకు వాటికి ఓపిగ్గా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికీ నా రోల్‌కి ఎలాంటి జస్ట్ఫికేషన్ ఇస్తారా అని చాలా అనుకునేదాన్ని. సినిమా చూశాక ఇంత అద్భుతంగా దీన్ని డీల్ చేశారా అనిపించింది.
మరో స్టార్ సమంతతో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
లెక్కలేసుకుని ఎవ్వరూ సినిమాలు చేయరు. సినిమాలో మన పాత్ర ఎలా వుందీ, దానికి ప్రాధాన్యత ఎలా వుందీ అన్నదే ముఖ్యం. ‘బ్రహ్మోత్సవం’ కథ ప్రకారం ఇందులో పాత్రలుంటాయే తప్ప స్టార్ స్టామినాపై అవి ఆధారపడవు. అలాంటప్పుడు మల్టీస్టారర్ అయినా, మరింకేదైనా మనం ఇబ్బందిగా ఫీలవ్వడానికి ఏమీ లేదు.
పివిపి సినిమా గురించి?
పివిపి ఎన్నో సినిమాల అనుభవం వున్న వారిలా సినిమాను చాలా చాకచక్యంగా పూర్తిచేస్తుంటారు. స్క్రీన్ నిండా స్టార్స్ వుండే సినిమాను ఇలా పకడ్బందీగా పూర్తిచేయడంలో పివిపి టీమ్ చేసిన కృషి చాలా బాగుంది. కథ, మహేష్ చరిస్మా ఈ సినిమాకు మేజర్ హైలెట్స్. ఇకపోతే కలర్‌ఫుల్ సీన్స్, సినిమా నిండా కనిపించే స్టార్స్, అందమైన కుటుంబ బంధాలు.. ఇవన్నీ అన్ని రకాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయగలిగే సినిమా.

- యు