పవన్..చిరులతో చేస్తానో లేదో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్ రాజు సినిమాలంటే ముఖ్యం గా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఆసక్తి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు నిర్మిస్తారన్న పేరున్న ఆయన లేటెస్టుగా తీసిన సినిమా ‘సుప్రీమ్’. సాయిధరమ్‌తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దిల్‌రాజు చెప్పిన విశేషాలు...
రెస్పాన్స్ అదిరింది
అనిల్ చెప్పిన ఈ కథ పెద్ద కమర్షియల్ ఎంటర్‌టైనర్ అవుతుందని నమ్మి సినిమా చేశా. నా నమ్మకం ఈ రోజు నిజమైంది. సాధారణంగా నా సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ముఖ్యంగా నలుగురైదుగురు ఫోన్ చేసి సినిమా ఎలా వుందో ఖచ్చితంగా చెప్పేసేవారు. అయితే సుప్రీమ్ సినిమా విడుదలైన రోజు వారెవరూ నాకు ఫోన్ చేయలేదు. శ్రీరాములు థియేటర్‌కు నేను, అనిల్ రావిపూడి కలిసి వెళ్లాం. అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాక నాకు ధైర్యం వచ్చింది. రెండు మూడు రోజుల వరకు ఏం భయపడవద్దని యూనిట్‌కు చెప్పాను. ఫస్ట్ వీక్‌లో కలెక్షన్లు స్టడీగా వున్నాయి.
మమ్మల్ని ఫాలో అయ్యాడంతే..
సాయిధరమ్‌తో మూడు సినిమాలు చేశాను. మూడింటిలో తన పనిని మాత్రం చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ సినిమాలో కూడా దర్శకుడు అనిల్, నన్ను ఫాలో అయ్యాడంతే. దివ్యాంగులున్న వ్యక్తుల ఫైట్ సీన్ ఆలోచన అనిల్ రావిపూడిదే. తను సెకెండాఫ్ రాసుకున్నపుడు ఈ సీన్ ఉండాలని ముందే అనుకున్నాడు. క్లైమాక్స్ ముందు ఇలాంటి సీన్ ఉండాలనుకున్నప్పుడు దాని ఎగ్జిక్యూషన్ కూడా కరెక్టుగా ఉండాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇదోరకమైన రిస్క్ అని చెప్పవచ్చు. తనకు కరెక్టు ఎగ్జిక్యూషన్ ఉండటంతో క్లైమాక్స్ ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది
కథే లేదని ముందే తెలుసు...
హీరో ఓ పిల్లాడిని కలుస్తాడు. ఆ పిల్లాడికి ఉన్న సమస్యేంటో తెలుస్తుంది. దానికోసం హీరో ఏం చేశాడనేదే సినిమా. అనిల్ కథను చెప్పినపుడు ఇందులో కథ ఏం లేదని తెలుసు. కాని కథను చెప్పిన విధానం నచ్చింది. సినిమా అంతా కామెడీ ఉండేలా మధ్యలో ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసుకుంటూ వచ్చి ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేశాడు.
రెండు బ్యానర్స్..
‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’, ‘కొత్తబంగారులోకం’ చిత్రాలు తర్వాత నేను కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నేను కూడా ఎకనమిక్‌గా బిజినెస్ పరంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఒకట్రెండు మినహా స్టార్ హీరోలతో చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. అయితే నా మార్కు సినిమాలు రావడం లేదని చాలామంది అంటున్నారు. అలాగని దర్శకులు కమర్షియల్ సినిమాలను చేయాలని వస్తే కాదనలేదు. అందుకని నా మార్క్ ఫ్యామిలీ, యూత్‌ఫుల్ సినిమాలకోసం నేను నిర్మాతగా వ్యవహరిస్తాను. అలాగే ఇప్పుడు నేను మారుతితో కలిసి ఓ సినిమాను, బెక్కం వేణుగోపాల్‌తో కలిసి మరో సినిమా చేయబోతున్నాను. ఇలాంటి సినిమాల కోసం ఓ కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేసి నా సమర్పణలోనే, నా బ్యానర్ రిలీజ్‌లోనే, శిరీష్, హర్షిత్‌లను నిర్మాతలుగా పెట్టి సినిమాలు చేస్తాను. ఓ సినిమా నా బ్యానర్‌లో వచ్చి అపజయం అయ్యిందంటే డైరెక్టర్ లేదా హీరోని తప్పుపట్టను. ఎందుకంటే కథను నేను ఓకే చేసిన తర్వాత సెట్స్‌లోకి వెళుతుంది. అందుకనే జయాపజయాలను ఒకేలా తీసుకుంటాను. ‘కృష్ణాష్టమి’ విషయానికి వస్తే సునీల్‌ను కొత్తగా చూపించాలని ప్రయత్నించాం. అయితే మా ప్రయత్నం సక్సెస్ కాలేదు. కృష్ణాష్టమి సినిమా నాకొక పాఠంగా భావిస్తాను.
పూరి అడిగితే ఇచ్చేశాను...
నేను నా బ్యానర్‌లో ‘జనగణమన’ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేశాను. అయితే ఆ టైటిల్‌పై సినిమా చేయడానికి టైం పడుతుంది. పూరి జగన్నాథ్ ఫోన్ చేసి ఆ టైటిల్ కావాలని అడిగారు. సరే ఎలాగూ ఆ సినిమా ఇప్పుడు తీయడంలేదు కదా అని ఆయనకిచ్చేశాను. ఇక పవన్‌కళ్యాణ్‌గారితో సినిమా
చేస్తానని అనుకున్నాను. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళితే సినిమాలు చేయనంటున్నారు. మరి ఆయనతో సినిమా చేసే అదృష్టముందా, ఉంటే
తప్పకుండా చేస్తాను. అలాగే చిరంజీవిగారితో సినిమా చేస్తానా లేదా అని చెప్పలేను. అందుకే సినిమాల విషయంలో ముందే ఏదీ ఖచ్చితంగా చెప్పలేం
ఎందుకంటే సినిమా అంటే మ్యూజిక్. మధ్యలో ఏ మార్పులైనా జరగవచ్చు.
ప్రయోగాలూ చేయను..
‘24’ వంటి ఎక్స్‌పరిమెంట్స్ సినిమా కథలను నేను జడ్జ్ చేయలేను. అదీగాక సినిమాపై ఆధారపడి చాలామంది ఉంటారు కాబట్టి నేను ఎక్స్‌పరిమెంట్స్ మూవీస్ చేయను. నా నెక్ట్స్ సినిమా సతీష్ వేగ్నేశ్ దర్శకత్వంలో ‘శతమానం భవతి’ సినిమా చేస్తాను. ఈ సినిమాకు ఫెస్టివల్ లాంటి సినిమా అనే క్యాప్షన్ అనుకున్నాను. రాజ్‌తరుణ్ విని తను కూడా చేస్తానని అన్నాడు. శతమానం భవతి సినిమాను ఆగస్టులో ప్రారంభించి వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయాలని ప్లాన్ చేశాను. అప్పుడు ఏ హీరో డేట్స్ ఖాళీగా వుంటాయో వారితో సినిమా చేస్తా.

- శ్రీ