నెలాఖరులో కబాలి పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పడు ‘కబాలి’ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈమధ్యే విడుదలైన టీజర్‌తో రెట్టించిన ఉత్సాహంతో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు జూలై వరకు ఇలా ఎదురుచూస్తూనే వుండాలి. అయితే ఈలోగా అభిమానుల్లో ఉత్సాహాన్ని అలాగే కొనసాగించేందుకు నెలన్నర పాటు ప్రమోషన్స్‌తో ‘కబాలి’ టీమ్ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో భాగంగానే మొదట ఆడియో వేడుకను ఈనెలాఖర్లో భారీ ఎత్తున చేపట్టనున్నారని సమాచారం. తెలు గు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో కూడా రెండు వర్షన్స్ ఒకే రోజు విడుదల చేసేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. మే 31న ఉదయం చెన్నైలో తమిళ వర్షన్ ఆడియో లాంఛ్ కానుండగా, అదే రోజు సాయంత్రం తెలుగు వర్షన్ ఆడియో హైదరాబాద్‌లో లాంఛ్ కానుం ది. తమిళంలో రియలిస్టిక్ సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సెట్ చేసుకున్న రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించారు.