జూన్‌లో జెంటిల్‌మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెంటిల్‌మన్’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ‘అష్టాచమ్మ’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. ఇటీవల విడుదలైన తొలి టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా, కలర్‌ఫుల్‌గా సాగిన టీజర్‌కు వస్తున్న స్పందన చూసి చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, గురువారం విడుదలైన మా టీజర్‌కి చాలా మంచి స్పందన వస్తోందని, ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయని, మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, ఆయన సమకూర్చిన సంగీతం చిత్రానికి హైలెట్ అవుతుందని, ఈనెల 22న పాటలను విడుదల చేస్తున్నామని అన్నారు. ఇది అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ అని, అన్నిరకాల భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులూ చూసేలా పసందుగా ఉంటుందని, జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, వెనె్నల కిశోర్, ఆనంద్, రోహిణి, సత్యం రాజేష్, రమాప్రభ, ప్రగతి, రాజశ్రీ నాయర్, శ్రీముఖి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ:డేవిడ్ నాథన్, సంగీతం:మణిశర్మ, కెమెరా:పి.జి.విందా, ఆర్ట్:ఎస్.రవీందర్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, కోడైరెక్టర్:కోట సురేశ్‌కుమార్, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:మోహనకృష్ణ ఇంద్రగంటి.