గ్రాఫిక్స్‌లో నాయకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ముఖ్యంగా త్రిష పాడిన ‘మిడ్‌నైట్ సడన్‌గా ఎక్కడో దూరంగా’ పాటకు విడుదలైన గంటలోనే లక్షకు పైగా హిట్స్ వచ్చాయని తెలిపారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో 40 నిమిషాలపాటు సాగే గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలాఖరుకుగాని, జూన్ మొదటివారంలోగాని ఒకే రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హార్రర్ జోనర్‌లో సరికొత్త కోణంలో సాగే ఈ చిత్రంలో త్రిష పాత్రలో విభిన్నమైన కోణాలు ఉంటాయని, ఆమె కెరీర్‌లో మైలురాయి లాంటి చిత్రంగా నిలుస్తుందని దర్శకుడు గోవి తెలిపారు. గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, జీవీ, సత్యం రాజేష్, జయప్రకాష్, సుష్మారాజ్, కోవై సరళ, మనోబాల తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:జగదీష్ చీకటి, సంగీతం:రఘు కుంచె, ఎడిటింగ్:గౌతంరాజు, దర్శకత్వం:గోవి.