దేవ కట్టాకు ఓకే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిట్టు తెచ్చిన ఉత్సాహంతో -ప్రతి ప్రాజెక్టునీ పండగ చేసే ప్రయత్నంలో ఉన్నాడు హీరో సాయితేజ్. ప్రస్తుతం -సోలో బ్రతుకే సో బెటర్ అన్న థీమ్‌తో దర్శకుడు సుబ్బు చేస్తున్న ప్రాజెక్టుతో బిజీగా వున్న సాయితేజ్, తరువాతి ప్రాజెక్టునీ లైన్‌లో పెట్టేశాడట. ‘ఎస్‌బిఎస్‌బి’ ప్రాజెక్టు చిత్రీకరణ దాదాపు పూరె్తైంది. మే 1న సినిమాను థియేటర్లకు తెచ్చే సన్నాహాల్లో చిత్రబృందం ఉంది. ఈ సినిమా విడుదల తరువాత పెద్ద గ్యాప్ తీసుకోకుండా మరో ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సాయి సన్నాహాలు చేసుకున్నట్టు సమాచారం. దర్శకుడు దేవ కట్టా సిద్ధం చేసిన వైవిధ్యమైన కథతో సాయితేజ్ -వచ్చే జూన్‌లోనే సెట్స్‌పైకి వెళ్తాడట. మారుతి తీసిన ప్రతిరోజూ పండగే చిత్రంలో సెటిల్డ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సాయితేజ్ -దేవ కట్టా ప్రాజెక్టులోనూ అలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎమోషన్‌ల్ ఎలిమెంట్స్‌తో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ స్టోరీ సాయితేజ్‌కు హార్ట్‌టచింగ్ అనిపించిందట. ఈ ప్రాజెక్టులో దర్శకుడు దేవకట్టా సూచనల మేరకు కొత్త లుక్ ట్రై చేయొచ్చని తెలుస్తోంది. సాయితేజ్‌తో రొమాన్స్ చేసే హీరోయిన్, ఎదుర్కొనే విలన్ ఎవరన్నది కొద్దిరోజుల్లోనే తెలియొచ్చు.