మురిపించిన శేషమణి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుకుమార్‌కి -శేషమణి దొరికేసిందట. అక్షరాలుగా రాసుకున్న పాత్ర -రష్మిక ముఖంలో ప్రత్యక్షమవ్వడంతో సుకుమార్ సంతోషపడుతున్నాడట. ఏ దర్శకుడైనా -స్క్రిప్ట్‌లో తను రాసుకున్న పాత్ర అచ్చంగా అలాగే కళ్లముందు కనిపిస్తే ఇలాగే సంతోషపడతాడేమో. ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే -ఏఏ 20 ప్రాజెక్టును తెరకెక్కించే పనిలో నిమగ్నమైవున్నాడు దర్శకుడు సుకుమార్. ఏ పాత్రనైనా -తననుకున్న పోట్రెయిట్‌లోకి వచ్చేవరకూ తహతహలాడే సుకుమార్ -అల్లు అర్జున్ ప్రాజెక్టులో ‘శేషమణి’ పాత్రపైనా అలాగే ఫోకస్ పెట్టాడని అంటున్నారు. ఇంతకుముందు రంగస్థలం చిత్రంలో ‘రామలక్ష్మి’గా సమంతను ఎంత శ్రద్ధగా చూపించాడో.. ‘శేషమణి’ పాత్రపైనా అంతే ఫోకస్ పెట్టాడన్నది ఇన్‌సైడ్ టాక్. నిజానికి రంగస్థలానికి ‘రామలక్ష్మి’ -ఓ తెలీని అందం.
ఇప్పుడు బన్నీ ప్రాజెక్టుకూ -శేషమణి అంతే అందమట. అందుకే -సుకుమార్ ఊహలోని శేషమణి అవతారం చూపేందుకు రష్మిక చాలా ఫొటోషూట్లే చేసిందని అంటున్నారు. కథ ప్రకారం -నల్లమల అడవుల్లో నివాసముండే మూర్త్భీవించిన అమాయకపు అమ్మాయే శేషమణి. మొత్తానికి రష్మిక చేసిన ఫొటోషూట్స్ నుంచి ఒక ‘శేషమణి’ని సుకుమార్ ఎంపిక చేసుకున్నాడన్నది తాజాగా వినిపిస్తోన్న మాట. సుకుమార్‌కు నచ్చిన శేషమణిని చూడాలంటే -ఫస్ట్‌లుక్ వచ్చే వరకూ ఆగాల్సిందేనేమో.