అలా సెట్టైందా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో స్టార్ హీరోలంతా -హిట్టు డైరెక్టర్లను ముందే లైనప్ చేసుకుంటున్నారు. తప్పకుండా హిట్టివ్వగలరన్న దర్శకులను ముందే లాకవ్వడమో, లేదా లాక్ చేసుకోవడమో మాటమాత్రంగానే సాగిపోతోంది. సినిమాల మధ్య గ్యాప్ లేకుండా యాక్టివ్ ప్లాన్ చేసుకుంటున్నారు కనుక -దర్శకులు సైతం ప్రాజెక్టులు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ముందే సెటప్ చేసుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈక్రమంలో రాబోయే రోజుల్లో ‘విచిత్రమైన లైనప్’ చూడబోతున్నామన్న అంశంపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ -దిగ్గజ దర్శకుడు రాజవౌళి వద్ద లాకయ్యారు. చారిత్రక పాత్రలైన అల్లూరి, కొమురం భీమ జీవితాల్లోని ‘మిస్టీరియస్ టైం’ని కంటెంట్ చేసుకుని -జక్కన్న చెక్కుతోన్న ఫాంటసీ పాయింట్‌తో ‘ట్రిపుల్ ఆర్’ చేస్తుండటం తెలిసిందే. ఈ సినిమా తరువాత జూ.ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే ప్రాజెక్టుకు అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. అలాగే రామ్‌చరణ్ -దర్శకుడు కొరటాల శివతో ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడన్నది తాజాగా వినిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల -చిరంజీవితో ‘ఆచార్య’ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, జూ.ఎన్టీఆర్ -త్రివిక్రమ్; చరణ్ -కొరటాల ప్రాజెక్టులు పూరె్తైన వెంటనే దర్శకులను మార్చుకుని జూ.ఎన్టీఆర్ -కొరటాల శివ, రామ్‌చరణ్ -త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టులు పడే అవకాశం లేకపోలేదన్న మాట వినిపిస్తోంది. అయితే, ఈ నలుగురితో కమిట్‌మెంట్స్‌వున్న ప్రొడక్షన్ హౌస్‌లుగా ఎవరు తెరపైకి వస్తారన్నది మాత్రం చూడాలి.