పక్కాగా.. వకీల్‌సాబ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్యాప్ తరువాత పవన్ కల్యాణ్ (పిఎస్‌పికె 26) -రీమేక్ ప్రాజెక్టుతో స్క్రీన్స్‌కు వస్తోన్న విషయం తెలిసిందే. సినిమాను మేలో విడుదల చేయాలన్న తలంపుతో వున్న చిత్రబృందం ప్రమోషన్స్ పర్వానికి తెరలేపింది. సోమవారం సాయంత్రం పవన్ ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఫుస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్ చేయనున్న నేపథ్యంలో -దానిపై ఇండస్ట్రీలో ఆకస్తి కనిపిస్తోంది. సినిమా పింక్‌కు రీమేక్ కనుక కథానుగుణంగా టైటిల్‌ను -వకీల్‌సాబ్ అనుకుంటున్నట్టు ఇప్పటి వరకూ కథనాలు వినిపించాయి. దిల్ రాజు సైతం ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని, దాదాపుగా టైటిల్ అదే కన్ఫర్మ్ అని కథనాలు వస్తూనే ఉన్నాయి. అవి నేటితో క్లియరయ్య అవకాశం ఉంది. నేడు ప్రకటించనున్న టైటిల్ కూడా ‘వకీల్‌సాబ్’ కావొచ్చని గట్టిగా వినిపిస్తోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. పవన్ కెరీర్‌లోనే తొలిసారి లాయర్ పాత్ర పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు ప్రతివాది పాత్రలో ప్రకాష్‌రాజ్ కనిపించనున్నారు.