పాన్‌వరల్డ్ హీరోతో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పాన్ వరల్డ్’ సినిమాకు సిద్ధమవుతున్నాడు హీరో ప్రభాస్. ‘మహానటి’తో దర్శకుడిగా తన స్టామినాను చూపించిన నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ కొత్త ప్రాజెక్టుకు రెడీ అవ్వడం తెలిసిందే. అశ్వనీదత్ నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ అగ్ర నటి దీపికను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట. ‘సూపర్ హీరో’ క్యారెక్టర్‌లో ప్రభాస్‌ను చూపించేందుకు నాగ్ అశ్విన్ కథను సిద్ధం చేసుకోవడంతో -హీరో పాత్రను బ్యాలెన్స్ చేయగల హీరోయిన్‌గా దీపికా పదుకొనె అయితే బావుంటుందన్న ఆలోచనతో ఉన్నాడట. నిజానికి -‘పాన్ వరల్డ్’ డైలాగ్ ఓపెన్ చేసింది దర్శకుడు నాగ్ అశ్వినే. సో, ప్రాజెక్టును అదేస్థాయిలో ప్లాన్ చేస్తున్న దర్శకుడు -అంతటి ఇమేజున్న హీరోయిన్‌గా దీపికను అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్రనటిగా దీపిక ఇమేజ్ తక్కువేం లేదు. చాలా ప్రాడెక్టులకు ఇంటర్నేషనల్ అంబాసిడర్‌గానూ ఆమె పాపులరైంది. బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టులతో దీపిక్ టాప్‌స్టార్‌గా వెలుగుతోంది. సో, ప్రభాస్ -దీపిక కాంబో అయితే ‘పాన్ వరల్డ్’ అన్న స్థాయిని జస్టిఫై చేసినట్టు అవుతుందని మేకర్స్ యోచిస్తున్నారట. ఇప్పటికే దీపికతో సంప్రదింపులు మొదలెట్టారన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ చేస్తున్నాడు. ఇది పూర్తికాగానే కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే అవకాశముంది.