బంజారా భాషలో రామ్‌నాయక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమేష్ చౌహాన్, శుభాంగి జోడీగా తుల్జా భవానీ ఫిల్మ్ సిటీ బ్యానర్‌పై లక్ష్మీ చౌహాన్ నిర్మిస్తోన్న చిత్రం -రామ్‌నాయక్. దర్శకుడు కపిల సుబ్బారావు తెరకెక్కించనున్న చిత్రం నిర్మాణ కార్యక్రమాలు హైదరాబాద్‌లో లాంచనంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా హీరో రమేష్ చౌహాన్ మాట్లాడుతూ -బంజారా భాషలో నిర్మించనున్న ఈ సినిమాలో ప్రేక్షకుల మనసుతాకేలా ఐదు పాటలుంటాయి. సంగీత దర్శకుడు బోషావలి పాటలకు ప్రాణం పోశారు. దర్శకుడు కపిల సుబ్బారావు పనితనంలో సినిమా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందనే అనుకుంటున్నా అన్నారు. సంగీత దర్శకుడు బోలేషావలి మాట్లాడుతూ -బంజారా భాషలో వచ్చిన ‘గోర్‌జీవన్’ హిట్టు తరువాత అంతే మనసుపెట్టి చేసినా పాటలివి. మ్యూజికల్ హిట్టుగా నిలిచి నాకు మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నా అన్నారు. దర్శకుడు కపిల సుబ్బారావు మాట్లాడుతూ -మార్చి 3నుంచి షూటింగ్ మొదలుపెడుతున్నాం. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ పరిసరాల్లో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేశాం. కథ, సంభాషణలే కాదు మేం చూపించే లొకేషన్లు సైతం ఆడియన్స్‌కి నచ్చుతాయని అనుకుంటున్నా అన్నారు. ఈ చిత్రంలో జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు, లక్కింశెట్టి నాగేశ్వర రావు, రైజింగ్ రాజు, బుల్లితర నటి శ్రావణి తదతరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.