వరుస పెడుతుందా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీ సౌభాగ్యవతి అంటే ఇలా ఉండాలన్నంతగా -అంజలి పాత్రతో రెండేళ్ల క్రితం తెలుగు ఆడియన్స్ కళ్లను కట్టిపడేసింది పంజాబీ బ్యూటీ రుహానీ శర్మ. హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చి.ల.సౌలో రుహానీ పోషించిన అంజలి పాత్రను అంత సులువుగా మర్చిపోలేం. అయితే, టాలీవుడ్ స్క్రీన్‌మీద అలాంటి పాత్రలు అరుదు కనుక -పక్కింటి పిల్ల పాత్రలు రుహానీనీ మళ్లీ పలకరించలేదు. హిందీ, తమిళం, మలయాళంలో బిజీ కావడంతో ఆమె కూడా తెలుగు సినిమాలపైనా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు విశ్వక్సేన్ హీరోగా చేసిన నాని సొంత సినిమా ‘హిట్’తో మళ్లీ తెలుగు ఆడియన్స్‌ని పలకరించనుంది రుహానీ. అయితే, హిట్ థియేటర్లకు రాకముందే మరో ప్రాజెక్టులో ఆమెకు చాన్స్ దక్కిందన్న మాట వినిపిస్తోంది. నాగశౌర్య హీరోగా నిర్మాత మహేష్ కోనేరు కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టనున్నాడు. కొత్త దర్శకుడు రాజా తెరకెక్కించనున్న ప్రాజెక్టు ఈవారంలోనే లాంచ్ చేసే అవకాశముందట. ఆ ప్రాజెక్టులో నాగశౌర్యకు జోడీగా రుహానీని ఎంపిక చేసినట్టు సమాచారం. అందం, అభినయం కలగలిపిన తెలుగింటి మల్లె తీగ రుహానీకి -‘హిట్’ హిట్టయితే కనుక చాన్స్‌లు క్యూ కట్టడం ఖాయం. పాత హీరోయిన్ల ఫేస్‌లు చూసి చూసీ మొహంమొత్తి -కొత్తందాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు ఆడియన్స్ ముచ్చటను రుహానీ తీరుస్తుందేమో చూడాలి.