మరిన్ని స్వేచ్ఛలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తి జాతికి జరుగుతోన్న అన్యాయంపై సందేశాత్మకంగా నిర్మించిన ‘స్వేచ్ఛ’లాంటి చిత్రాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉందని మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డి అన్నారు. గాయని మంగ్లీ లీడ్‌రోల్ చేసిన ‘స్వేచ్ఛ’ ప్రీరిలీజ్ వేడుకలో తీగల మాట్లాడుతూ -మంగ్లీ మంచి సింగర్‌గా తెలుసు. స్వేచ్ఛతో మంచి నటి అనిపించుకుంటుందని భావిస్తున్నా అన్నారు. నటుడు చమ్మక్ చంద్ర మాట్లాడుతూ -గోర్ జీవన్ టైటిల్‌తో బంజారా భాషలో విడుదలై సెనే్సషన్ సృష్టించిన సినిమా ఇది. చిన్న సినిమాను మీడియా ముందుకు తీసుకెళ్లాలి అన్నారు. కథానాయిక మంగ్లీ మాట్లాడుతూ -ఇది బంజారాల సినిమా కాదు. ప్రజల సినిమా. అనేక ప్రాంతాల్లో అణగారిన వర్గాల్లో నడిచే కథ. చక్కటి సందేశం ఉండటంతో నేనూ నటించాను. తెలుగులోనూ సినిమా హిట్టవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు, హీరో కెపిఎన్ చౌహాన్ మాట్లాడుతూ -సినిమాను విడుదల చేయడానికి నిర్మాత రాజునాయక్ ఎంతో ఎఫర్ట్ పెట్టారు. అందుకు తగిన ప్రతిఫలం దక్కాలి అని ఆకాంక్షించారు. నిర్మాత రాజునాయక్ మాట్లాడుతూ -సినిమా ప్రచారంలో కొత్త పుంతలు తొక్కిందని, అన్ని థియేటర్లలో భారీగా విడుదలవుతోన్న సినిమా హిట్టవుతుందన్న నమ్మకంతో ఉన్నామన్నారు.