సైలెన్స్.. స్వీటీ సీరియస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క నుంచి రెండేళ్ల క్రితం భాగమతి వచ్చింది. తరువాత చిరంజీవి ‘సైరా’లో తళుక్కున మెరవడం తప్ప -అనుష్క నుంచి మరో సినిమా లేదు. వెయిట్‌లాస్ ప్రోగ్రాంలో బిజీగా ఉండటంతో -అనుష్క చాలాకాలం ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. తాజాగా ఆమె లీడ్‌రోల్ చేసిన నిశ్శబ్ధం సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రాజెక్టు అంతకంతకూ ఆలస్యం అవుతుండటం పట్ల అనుష్క అసహనానికి గురవుతోందన్న కథనాలు వస్తున్నాయి. నిజానికి ఏప్రిల్ 2న ‘నిశ్శబ్ధం’ రిలీజ్ డేట్ అంటూ మేకర్లు ప్రకటించారు. తాజా పరిణామాలు చూస్తే మాత్రం -్ఫక్స్ చేసుకున్న తేదీలో సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవన్నది ఇన్‌సైడ్ టాక్. ఇదే అనుష్కలో అసహనానికి కారణమన్న టాక్ వినిపిస్తోంది. అనుష్క -మాధవన్ లీడ్‌రోల్స్‌లో దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించిన చిత్రం నిశ్శబ్ధం. హాలీవుడ్ ఆర్టిస్టులతోపాటు అంజలి ఓ కీలక పాత్ర పోషించింది. ఐదు భాషల్లో ఏకకాలంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుని మరీ తెరకెక్కించారు. అయితే, సినిమా ఫైనల్ ప్రొడక్ట్‌ని సిద్ధం చేస్తున్న టైంలో నిర్మాత, రచయిత కోన వెంకట్ కొన్ని కరెక్షన్స్ చెప్పడంతో, ఎడిటింగ్ టేబుల్‌పై వాటిని సెట్ చేయడానికి హేమంత్ టీం కసరత్తులు చేస్తోందట. ఒకవేళ ఆ సీన్స్ సెట్ కాకపోతే, రీషూట్ చేద్దామంటూ నిర్మాత కోన వెంకట్ ప్రతిపాదించటంతో -ప్రాజెక్టులో జరుగుతోన్న ఆలస్యాన్ని అనుష్క భరించలేకపోతోందని అంటున్నారు. ఏతావాతా పరిస్థితులు చూస్తుంటే ‘నిశ్శబ్ధం’ విడుదల తేదీ వెనక్కి జరిగేలానే ఉంది. త్వరలోనే మేకర్లు కొత్త విడుదల తేదీని ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.