ట్రైలర్‌లో అర్జున

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజశేఖర్ ద్విపాత్రాభినయంగా దర్శకుడు కన్మణి తెరకెక్కించిన చిత్రం -అర్జున. నట్టీస్, క్విట్టీ ఎంటర్‌టైన్‌మెంట్లపై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తోన్న చిత్రమిది. మరియం జకారియా హీరోయిన్. తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -మార్చి 6న అర్జున థియేటర్లకు వస్తున్నాడు. తండ్రీ కొడుకులుగా రాజశేఖర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సమకాలీన రాజకీయ నేపథ్య పరిస్థితులు, కొన్ని యధార్థ సంఘటనలతో సహజత్వానికి దగ్గరగా సినిమా రూపొందించాం. రైతుగా, ఆయన తనయుడు అర్జునగా రెండు పాత్రల్లోనూ రాజశేఖర్ భావోద్వేగ సన్నివేశాల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు చిత్రంలో ఉన్నాయన్నారు. కోట శ్రీనివాసరావు, చలపతిరావు, రేఖ, మురళీ శర్మ, సుప్రీత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.