గ్రాఫిక్స్... బోర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలికాలంలో ప్రభాస్ చిత్రాలంటేనే గ్రాఫిక్స్‌తో కూడుకున్నదిగా నిండిపోతోంది. బాహుబలి నుంచి సాహో చిత్రాల వరకూ ప్రతి సినిమాలో దాదాపు 80 శాతం విజువల్ ఎఫెక్ట్సే వుంటున్నాయి. అందువల్ల అటువంటి సీన్‌లకు రియాలిటీ లేకపోవడంతో ప్రేక్షకులు తిప్పికొడుతున్నారన్న అభిప్రాయానికి వచ్చారు హీరో ప్రభాస్. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం పీరియాడిక్ లవ్‌స్టోరీని చర్చిస్తోంది. అది కూడా 1980 నేపథ్యంలో సాగే కథనం కావడంతో ఎక్కువగా గ్రాఫిక్స్‌ను ఉపయోగించే అవకాశం వుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే హీరో ప్రభాస్ గత చిత్రాల మాదిరిగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించవద్దని సలహా ఇచ్చారట. అన్నీ సహజత్వానికి దగ్గరగా వుండే సన్నివేశాలనే చిత్రీకరించడానికి సిద్ధమవుతోంది యూనిట్. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించిన సన్నివేశాలు వీలైనంత తగ్గించమని హీరో కోరడంతో దర్శక నిర్మాతలు కూడా ఓకె చేశారు. అయితే ఆ విధంగా సినిమా షూటింగ్ చేయాలంటే సమయం ఎక్కువ పడుతుంది అని యూనిట్ చెబుతోంది. ఈమధ్యకాలంలో వస్తున్న గ్రాఫిక్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తున్న సంగతి సినిమా ఇండస్ట్రీకి కూడా అవగతమవుతోంది. ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సంవత్సరాంతానికి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు హిందీలో విడుదల చేయనున్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుండగా, కృష్ణంరాజు, మిథున్ చక్రవర్తితోపాటుగా మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని టాలీవుడ్ సమాచారం.