ఏమో.. మహేష్ ఓకే అనొచ్చు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి సినిమాలో మహేష్‌బాబు ఓ పాత్ర చేస్తే? ప్రాజెక్టుకు అంతకు మించి కమర్షియాలిటీ ఏముంటుంది? వినిపిస్తున్న కథనాల్లో రోజురోజుకూ పెరుగుతోన్న ఇంటెన్సిటీని చూస్తే -చిరు ప్రాజెక్టులో మహేష్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది. చిరు-కొరటాల కాంబో ప్రాజెక్టులో చరణ్ కోసం ఓ పాత్ర అల్లుకున్నారు. అయితే, డేట్స్, ఈక్వెషన్స్ సరిచూసుకుని చరణ్ పాత్రలోకి బన్నీని తేవాలనుకున్నారు. బన్నీ ఆసక్తి చూపకపోవడంతో -మహేష్‌ను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇదీ కొద్దిరోజులుగా వినిపిస్తోన్న కథనాలు. తాజాగా మహేష్‌కు దర్శకుడు కొరటాల మొత్తం కథతోపాటు, మహేష్ ప్రాధాన్యతా పాత్రను విపులంగా చెప్పాడని, దీనిపై నిర్ణయానికి వారం టైంకావాలని మహేష్ అడిగాడంటూ కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. చిరు-మహేష్ కాంబినేషన్ సీన్స్ లేకపోవడం.. చిరుపై మహేష్‌కి వున్న ప్రత్యేకాభిమానం.. నిర్మాత చరణ్‌తో వున్న స్నేహంలాంటి ఈక్వెషన్స్ వర్కౌటైతే.. మహేష్ ఒకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ కొత్త ప్రాజెక్టు తక్షణం మొదలయ్యే అవకాశం లేదు కనుక -ప్రాధాన్యత కలిగిన పాత్ర కోసం నెలరోజుల డేట్స్ ఇవ్వొచ్చనీ అంటున్నారు. రెండు హిట్లిచ్చిన దర్శకుడు కొరటాలతో వున్న స్నేహం, మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంలాంటి పరిణామాల్లోనూ మహేష్ ఒకే చేయొచ్చన్న అంచనాలూ లేకపోలేదు. వినిపించే కథనాలన్నీ ఒకే అయితే -ఏప్రిల్‌లో మహేష్ ప్రాజెక్టులోకి చేరొచ్చన్నది ఇన్‌సైడ్ టాక్.