మార్చిలో.. వై తరుణి రాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతిరాజు, దీపాలిరౌత్, అఖిల్‌ప్రియ, సోముఉండర్ల ప్రధాన తారాగణంగా కొండారెడ్డి ప్రొడక్షన్స్‌పై అంబికా విజయ్ దర్శకత్వంలో బీవీ కొండారెడ్డి రూపొందించిన చిత్రం -వై తరుణి రాణా. చిత్రానికి సంబంధించిన బిగ్ సీడీ, ట్రైలర్‌ను జెమిని సురేష్, ప్రతాని రామకృష్ణగౌడ్, కాశం సత్యనారాయణ, అంజనా కార్గో సంయుక్తంగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు రాయంచ మాట్లాడుతూ -దర్శకుడి ఆసక్తిమేరకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించాను. కాకినాడ కాజా పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కథతోపాటు టెక్నికల్‌గానూ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు. నిర్మాత పూర్తి స్వేచ్ఛనివ్వడంతో మంచి సినిమాగా తీర్చిదిద్దే అవకాశం వచ్చిందని దర్శకుడు విజయ్ అన్నారు. వైవిధ్యమైన కథకు ఉన్నతమైన సంగీతం తోడే చిత్రం అద్భుతంగా వచ్చిందని, మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. హీరో శాంతిరాజు మాట్లాడుతూ -ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేటటువంటి పాటలు, ఫైట్స్‌తో సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమాలో భాగస్వామ్యమైన అందరికీ మంచి గుర్తింపు తెస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. కార్యక్రమంలో సదాచంద్ర, యానం బన్నీ, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.