ఆమెలో.. అదే ఠీవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుముఖ ప్రజ్ఞాశాలి, దర్శక నిర్మాత విజయ నిర్మల 74వ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ నానాక్‌రామ్‌గూడ నివాసంలో ఆమె విగ్రహాన్ని సూపర్‌స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. కొడుకు నరేష్, స్టార్ హీరో మహేష్‌బాబు, సీనియర్ హీరో కృష్ణంరాజు తదితర సినీ ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హాజరై విజయనిర్మలకు నివాళి ప్రకటించారు. ఈ సందర్భంగా నటుడు కృష్ణంరాజు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, మాజీ ఎంపీ మురళీమోహన్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన చిరస్మరణీయ సేవలను గుర్తు చేసుకున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ -ఐదారు చిత్రాల్లో నటించిన తరువాతే విజయనిర్మల దర్శకత్వంపై ఆసక్తి చూపించింది. వంద సినిమాలు పూర్తి చేసిన తరువాత దర్శకత్వం గురించి ఆలోచించమని సలహా ఇచ్చాను. అలాగే వంద చిత్రాలు పూర్తి చేశాక దర్శకత్వ విభాగానికి వచ్చింది. తొలిసారి చిన్న బడ్జెట్‌లో మలయాళంలో చేసిన ‘కవిత’ హిట్టవ్వడంతో, తెలుగులో మీనా తొలి చిత్రం చేసింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె దర్శకత్వం వహించిన 46 చిత్రాల్లో 95 శాతం హిట్టు సినిమాలే. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం. ఈరోజున ఆమె మనమధ్య లేకపోవడం బాధగా ఉంది. విజయ నిర్మలపై అభిమానంతో కార్యక్రమానికి హాజరైన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. గత ఏడాది హార్ట్ అటాక్ కారణంగా విజయనిర్మల హఠాన్మరణానికి గురవ్వడం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోని అనేక చిత్రాల్లో నటించిన విజయనిర్మల, మహిళా దర్శకురాలిగా 46 చిత్రాలు తీసి గినె్నస్ రికార్డు సాధించారు. ఎంతోమంది మహిళా దర్శకురాళ్లకు ఆదర్శమయ్యారు. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గుర్తుగా రఘుపతి వెంకయ్య అవార్డు ఆమెను వరించింది.