బోర్డ్‌లోకి బన్నీ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవిని ఆచార్యగా చూపిస్తూ దర్శకుడు కొరటాల మెగా 152 ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నాడు. సోషియో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రంలో రామ్‌చరణ్ ఎక్కువ నిడివి వున్న ప్రత్యేక పాత్రలో చేయనుండటం తెలిసిందే. నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపిస్తాడని, తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఆడియన్స్‌కి ఫీస్ట్ చేస్తారన్న కథనాలు నిన్నటి వరకూ వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం -ప్రాజెక్టు నుంచి చరణ్ పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. రాజవౌళి తెరకెక్కిస్తోన్న ట్రిపుల్ ఆర్ షూటింగ్ కారణంగా డేట్స్ క్లాష్ అవుతుండటంతో -చిరు, కొరటాల ప్రాజెక్టు ఆలస్యం చేయడం ఇష్టం లేక చరణ్ తప్పుకున్నాడన్న వార్తలొస్తున్నాయి. అయితే, మెగా ప్రాజెక్టు ఇమేజ్ మరింత పెంచేందుకు ఇద్దరు స్టార్ హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి సినిమాలో బన్నీ ప్రవేశించే అవకాశం లేకపోలేదన్నది ఒక కథనం. ఇటీవలి కాలంలో మెగా కాంపౌండ్‌కు కాస్త దూరంగా ఉంటున్నాడన్న కథనాలు ఎక్కువవుతోన్న నేపథ్యంలో -బన్నీని ప్రాజెక్టులోకి తీసుకొస్తే మెగాకోటకు బీటలుపడే అవకాశం ఉండదన్నది ఒక ఆలోచన అంటున్నారు. అయితే, అల.. వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ -అతిథిగా కనిపించే నక్సలైట్ పాత్రను చేస్తాడా? అన్నది మిలయన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ చేస్తే -అతని ఇమేజ్‌కు ఎంతవరకూ కలిసొచ్చే విషయం అన్న లెక్కలు తెరపైకి రాకపోవు. మరో స్టార్ హీరో పేరుగా మహేష్ పేరూ వినిపిస్తోంది. మహేష్‌కు చరణ్ మంచి మిత్రుడు. పైగా చిరు ప్రాజెక్టుకు నిర్మాత చరణ్. అదీకాకుండా ఇప్పటికే -గీతా ఆర్ట్స్‌తో మహేష్ నిర్మాణ సంస్థ టైఅప్ అయ్యే ఆలోచనలతో ఉంది. ఇన్ని ఈక్వెషన్స్ నేపథ్యంలో చిరుమీద గౌరవంతో మహేష్ ఆ పాత్రకు అంగీకరిస్తాడా? అన్న లెక్కలూ లేకపోవు. ఏదేమైనా -ఈక్వెషన్స్ ఎటునుంచి ఎటు వర్కౌటై.. మెగా బోర్డులో ప్రత్యేక అతిథి పాత్ర ఎవరు పోషిస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తోన్న అంశం. వీళ్లిద్దరూ కాకపోతే.. బాలీవుడ్ స్టార్ హీరోని ఎవరినైనా ఒప్పించేందుకు దర్శకుడు కొరటాల ప్రయత్నిస్తాడా? అన్నదీ చూడాలి.