వాళ్లకంటే.. ముందే వచ్చా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్ చదలవాడ, దిగంగన సూర్యవంశీ జోడీగా రమేష్ కుదుముల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ -వలయం. 21న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో హీరో లక్ష్ మీడియాతో మాట్లాడాడు. -అదృశ్యమైన భార్యను వెతుక్కునే హీరో కథే ఇది. కథానాయకుడి పాత్రా అనుమానాస్పదం కావడంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్సేతో సాగుతుంది. పైగా యూత్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో వస్తోన్న పుల్ ప్యాక్ట్ సినిమా -వలయం. హీరోగా నాకిది ఐదో సినిమా. చైల్డ్ ఆర్టిస్టుగానూ మూడు సినిమాలు చేశా. అర్లీగా ఇండస్ట్రీకి వచ్చి చదువు కోసం సింగపూర్ వెళ్లిపోవడంతో -13ఏళ్ల తరువాత కంబ్యాక్ అవుతున్నా. ప్రభాస్, జూ. ఎన్టీఆర్ కూడా నా తరువాతే కెరీర్ ప్రారంభించారు. చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్న మాకు -బిచ్చగాడు సినిమా పెద్ద గిఫ్ట్. కంబ్యాక్ కావడానికి కారణం కూడా ఆ సినిమానే. నిర్మాతగా కంటే హీరోగా కొనసాగడమే కష్టం. ఈ సినిమాలో ఫిట్‌నెస్ కోసం 25 కేజీల బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ వర్కౌట్స్ చేస్తున్న టైంలో అనిపించింది -లైఫ్‌లో మళ్లీ ఈ కష్టాలెందుకు? అని. హీరోగా వలయం నాకు మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. చూడాలి, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నాడు లక్ష్.