రొమాంటిక్ జెంటిల్‌మెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘జెంటిల్‌మెన్’. సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ వివరాలు మాట్లాడారు. షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయని, అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని అన్నారు. ముఖ్యంగా ‘హీరోనా విలనా’ అనే కాప్షన్ అందరినీ ఆకర్షిస్తోందని, ఈనెల 12న టీజర్ విడుదల చేసి 22న ఆడియోను విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి కథ:డేవిడ్ నాథన్, సంగీతం:మణిశర్మ, కెమెరా:పి.జి.విందా, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:శివలెంక కృష్ణప్రసాద్, దర్శకత్వం:ఇంద్రగంటి మోహనకృష్ణ.