మొరాకోలో శాతకర్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు వెలుగును చాటిన చక్రవర్తి జీవితాన్ని తెరపైకి ఎక్కిస్తూ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ 100వ సినిమాగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందే ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 9నుండి మొదలుకానుంది. మొరాకోలోని అద్భుతమైన లొకేషన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నారు. ఒకటవ శతాబ్దానికి చెందిన సన్నివేశాలను రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్‌తో చిత్రీకరించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేయనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌కోసం అనే్వషణ సాగుతోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ తాజాగా గ్లామర్ భామ ఇలియానా నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.