సంపత్ నంది దర్శకత్వంలో నితిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ..ఆ’ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన తదుపరి ప్రాజెక్టులకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే గుండెజారి గల్లంతయ్యిందే వంటి విజయాన్ని అందించిన విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. దాంతోపాటు సంపత్‌నంది దర్శకత్వంలో మరో చిత్రం చేస్తాడట. సంపత్ నంది పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టి మధ్యలో డ్రాప్ అయ్యాడు. ఆ తరువాత రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చిత్రాన్ని చేసి హిట్ అందుకున్న సంపత్ నంది, ఇటీవలే నితిన్‌తో కథా చర్చలు జరిపాడని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి.