పల్లెటూరి పిల్లగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గళ్లలుంగీ ఎగ్గట్టి.. పొడుగు చేతుల చొక్కా మడతెట్టి.. నల్ల తుమాలు భుజానెట్టి.. కాళ్లకు చెప్పుల్లేకుండా పొలాలకు అడ్డంపడి నడుస్తున్నాడు శర్వానంద్ -శ్రీకారం సినిమా కోసం. ‘జాను’తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైన శర్వా -తదుపరి ప్రాజెక్టుగా చేస్తున్న శ్రీకారం సైతం సెట్స్‌పైనే ఉంది. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా నుంచి తాజాగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. రామ్ ఆచంట్, గోపీ ఆచంట నిర్మిస్తోన్న ఈ సినిమాతో కిషోర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో శర్వా లుక్ చూస్తుంటే -శతమానం భవతి తరువాత పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో చేస్తోన్న సినిమా అన్నది అర్థమవుతోంది. శర్వాతో ప్రియాంక అరుళ్‌మోహన్ జోడీ కట్టనున్నట్టు తెలుస్తోంది. మిక్కి జె మేయర్ సంగీతం సమకూర్చిన చిత్రం వెసవిలో థియేటర్లకు రావొచ్చని ఓ అంచనా.