ఈసారి.. వరుణ్‌తో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్న సినిమాలతో కెరీర్ మొదలెట్టి మీడియం రేంజ్ సినిమాలను సక్సెస్ చేయగల సత్తా సాధించాడు మారుతి. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టెక్కుతూ.. పడుతూ లేస్తూ -మంచి ఫ్లాట్‌ఫాంనే వేసుకున్నాడు మారుతి. స్టార్ హీరోల సినిమాలకు దూరంగావుంటూనే, వాళ్లను హ్యాండిల్ చేయగల స్టామినా తనకింకా రాలేదంటూ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు మారుతి. అడిగితే అల్లు అర్జున్ తనకు ప్రాజెక్టు ఇచ్చే అవకాశమున్నా -ఈ కారణంగానే ముందుకెళ్లడం లేదన్నది మారుతి మాట. అయితే, ఇది ప్రతిరోజూ పండగే విడుదలకు ముందునాటి పరిస్థితి. ఆ సినిమా హిట్టుతో స్టార్ హీరోల చిత్రాలనూ హ్యాండిల్ చేయగలనన్న నమ్మకం వచ్చిందన్న వాయిస్ మారుతినుంచి వినిపిస్తోంది. ప్రతిరోజూ పండగే సినిమా సక్సెస్ ఉత్సాహంలో ఉన్న మారుతి, దర్శకుడిగా మరో మెట్టెక్కేందుకు తదుపరి ప్రాజెక్టును మెగా హీరోకే సెట్ చేస్తున్నాడట. కొద్దిరోజుల క్రితం వరుణ్‌తేజ్‌కు లైన్ చెప్పి ఒప్పించిన మారుతి -స్క్రిప్ట్ పూర్తి చేస్తే పూర్తి నెరేషన్ వింటానన్న మాట తీసుకున్నాడట. గద్దలకొండ గణేశ్‌తో మాస్ హిట్టందుకున్న వరుణ్, ప్రస్తుతం కిరణ్ కొరపాటితో బాక్సింగ్ నేపథ్యంలో ప్రాజెక్టు చేస్తున్నాడు. వైవిధ్యమైన సబ్జెక్టులు చేస్తూ హీరోగా సెపరేట్ ట్రాక్ వేసుకుంటున్న వరుణ్.. -రెండు సీరియస్ సబ్జెక్టుల తరువాత మారుతితో ఓ ఫన్ సబ్జెక్టుతో ముందుకెళ్లే అవకాశం లేకపోలేదు. నాని, శర్వానంద్‌లాంటి హీరోలతో హిట్లుకొట్టిన మారుతి -వరుణ్‌తో ఎలాంటి ప్రాజెక్టు డిజైన్ చేస్తాడో చూడాలి.