కాన్సర్ ఆసుపత్రికి క్రిష్ విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గమ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన క్రిష్ రూపొందించిన ‘కంచె’ చిత్రానికి ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా 2015కుగాను జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డును ఇటీవలే దిల్లీలో రాష్టప్రతి చేతులమీదుగా అందుకున్న ఆయన ఆ పురస్కారంక్రింద వచ్చిన నగదును హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ప్రకటించాడు. నటుడు బాలకృష్ణను కలిసి ఈ చెక్కును అందజేశారు. తన తల్లితోపాటు ఎందరో కాన్సర్ బాధితులకు అత్యాధునిక వైద్య చికిత్స అందిస్తున్నందుకుగాను ఈ సొమ్మును విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం తెరకెక్కిస్తున్నాడు. క్రిష్ దాతృత్వాన్ని బాలకృష్ణసహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మెచ్చుకున్నారు.