బాలకృష్ణతో సినిమా తీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా పరిచమై తొలి చిత్రంతోనే మంచి కమర్షియల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా తరువాత సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నాలతో తెరకెక్కించిన చిత్రం ‘సుప్రీమ్’. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా అనిల్ రావిపూడితో ఇంటర్వ్యూ...

ఆ సుప్రీమ్ టైటిల్ గురించి?
- సుప్రీమ్ అని బిల్డప్‌కోసం పెట్టింది కాదు. ఈ కథలో క్యాబ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో హీరో క్యాబ్ డ్రైవర్. కాబట్టి ఆ క్యాబ్‌కు ఏదైనా పేరు పెడితే బాగుంటుందని ఆ పేరు పెట్టాం. అందరికీ నచ్చడంతో అదే టైటిల్‌గా మారింది.
ఆ కథ గురించి?
- కథ గురించి చెప్పాలంటే హనుమంతుడు వాయువేగంతో శ్రీరాముడికోసం ఏదైనా చేయడానికి వెళతాడు. ఈ కథలో హనుమంతుడిలాంటి టాక్సీ డ్రైవర్ ఎవరికోసం వెళ్ళాడనేదే అసలు కథ.
ఆ రాశీఖన్నాతో పోలీస్ పాత్ర వేయడానికి గల కారణం?
- ఈ చిత్రంలో బెల్లం శ్రీదేవి అనే పోలీసాఫీసర్ పాత్రలో రాశీఖన్నా కనిపిస్తుంది. లేడీ పోలీస్ ఆఫీసర్ అనగానే విజయశాంతి గుర్తుకొస్తుంది. అలాంటి పాత్రను కాస్త ఎంటర్‌టైనింగ్‌గా చూపించే ప్రయత్నం చేశాను. రాశీఖన్నా కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది.
ఆ రీమిక్స్ సాంగ్స్ పెట్టడానికి గల కారణం?
- కావాలని పెట్టింది కాదు. కానీ అలా కుదిరింది. నేను 80ల దశకంలో పుట్టాను కాబట్టి అప్పటి పాటల ఇంపాక్ట్ నాపై చాలా వుంది. ముఖ్యంగా చిరంజీవి పాటలు, డాన్సులంటే చాలా ఇష్టం. అలా ఈ సినిమా కూడా ‘సుప్రీమ్’ అనే టైటిల్‌కు తగ్గట్టుగా ఆ పాట వుండడంతో దాన్ని అలాగే రీమిక్స్ చేయించాం. ఒకరకంగా ఇది నాకున్న పాటల పిచ్చితో చేసిందే.
ఆ దిల్ రాజు బ్యానర్‌లో చేయడం?
- నేను చేసిన ‘పటాస్’ సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పటినుంచీ ఆయన నన్ను అభినందిస్తూనే వున్నారు. అప్పటినుంచి ఆయనతో నా జర్నీ స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఎమోషనల్‌గా ఆయనకు కనెక్ట్ అయ్యాను. ‘పటాస్’ టైమ్‌లోనే మనం సినిమా చేద్దామని ఆయన చెప్పడంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది.
ఆ తేజుతో పనిచేయడం ఎలా వుంది?
- తేజులో మంచి టాలెంట్ వుంది. కసితో పనిచేయాలనుకునే వ్యక్తి. ఎంతైనా కష్టపడతాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని రీమిక్స్ సాంగ్ కోసం చాలా కష్టపడ్డాడు. తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే పాత్ర ఇది.
ఆ హైలెట్స్ గురించి?
- ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్టు ప్రాణం పెట్టి చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాల సినిమా హైలెట్‌గా నిలుస్తుంది. నిజంగా ఆ సీన్ నిలిచిపోతుంది.
ఆ ‘రామారావుగారు’ ఎంతవరకు వచ్చింది?
- బాలకృష్ణతో ఆయన వందో సినిమాగా రామారావుగారూ చేద్దామనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ పోయింది. కానీ, ఆయన తన వందో సినిమాగా గొప్ప సినిమానే చేస్తున్నాడు. ఆ సినిమా తరువాత ఛాన్స్ వుంటే ఆయనతో చేస్తా.
ఆ తదుపరి చిత్రాలు
- ఇప్పటికైతే ఇంకా ఏమీ అనుకోలేదు. ఈ సినిమా రిజల్ట్ బట్టి వుంటుంది. దర్శకుడిగా కొన్ని సినిమాలు చేసిన తరువాత జనాలకు నేను బోరుకొడితే దాసరిగారిలా కేరెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అవుతా.

-శ్రీ