దాసరి జీనియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమలో పలు శాఖల్లో తనదైన గుర్తింపుతో ఐదు దశాబ్దాల కాలంగా వెలుగొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 72వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా, మోహన్‌బాబు, జగపతిబాబు, నరేష్, కోడి రామకృష్ణ, బాబూమోహన్, ఎన్.శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శత్రుఘ్నసిన్హా మాట్లాడుతూ, దాసరిగారు ఒక జీనియస్. మల్టీడైమెన్షనల్ పర్సనాలిటీ. జాతికి ఆయన ఒక హీరో. ఎప్పటికీ ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నానన్నారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ, ఇండస్ట్రీకి మరింత సేవ చేయడం కోసం భగవంతుడు నాకు మరింత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో గురువుగారెప్పుడూ సంతోషంగా వుండాలి అన్నారు.