సీన్‌లోకి అడ్డాల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎఫ్2తో మంచి హిట్టందుకున్న వెంకటేష్ -తదుపరి ప్రాజెక్టుపైనా ఆచితూచి అడుగులేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్టుకొట్టిన అసురన్ చిత్రం హక్కులు సొంతం చేసుకున్న సురేష్‌బాబు, వెంకటేష్‌తో ఆ సినిమా నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు. సరైన దర్శకుడి కోసం వెతుకుతున్న సురేష్‌బాబు, ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ధనుష్, మంజువారియర్ జోడీగా దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా కథా ప్రాధాన్యమున్న చిత్రమన్నది తెలిసిందే. వెంకీ సైతం అలాంటి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో -శ్రీకాంత్ అడ్డాలతో సినిమాను త్వరలోనే ప్రకటించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ప్రస్తుతం వెంకటేష్ -చైతూ మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంటున్న వెంకీమామ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు పూరె్తైన వెంటనే అసురన్ రీమేక్ ప్రాజెక్టును ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.