శునకమే.. నేస్తమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అవసరంలేని దర్శక నిర్మాత కెసి బొకాడియా. ఎన్నో సినిమాలు రూపొందించిన బొకాడియా తాజాగా తెలుగులో ‘తేరి మెహర్బానియా’ చిత్రానికి సీక్వెల్‌గా నమస్తే నేస్తమా చిత్రాన్ని అందిస్తున్నారు. శ్రీరామ్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రంలో రెండు కుక్కలు ప్రధాన పాత్రలు పోషిస్తాయట. ఈ చిత్రానికి సంబంధించిన మీడియా సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఫైట్‌మాస్టర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ -కుక్కలతో యాక్షన్ సీక్వెన్స్ చేయించడం నిజంగా నాకు సవాల్. దర్శక నిర్మాతల ప్రోత్సాహంతో చేయగలిగా. సినిమాలో ప్రతి సన్నివేశం బాగా వచ్చింది అన్నారు. దాదాపు 64 సినిమాలతో దర్శక నిర్మాతగా స్క్రీన్‌ప్లే రైటర్‌గా ప్రూవ్ చేసుకున్న బొకాడియా తెలుగులో తొలిసారి అందిస్తున్న సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకముందని గౌతమ్ చంద్ రాథోడ్ తెలిపారు. తాను ఒక అందమైన ప్రాజెక్టులో హీరోయిన్‌గా నటించడం హ్యాపీగా ఉందని, డాగ్ సెంట్రిక్ సినిమా అయినప్పటికీ డ్రామా, ఎమోషన్స్, రొమాన్స్‌లాంటి అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయని కథానాయిక ఈషానియా మహేశ్వరి అన్నారు. రివాజ్, ప్యార్ జూక్తా నహీలాంటి గొప్ప చిత్రాలను అందించిన తాను తొలిసారిగా నమస్తే నేస్తమా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నట్టు నిర్మాత కెసి బొకాడియా చెప్పారు. అమితాబ్, రజనీలాంటి అగ్రహీరోలతో సినిమాలు నిర్మించిన తాను, ఇకనుంచి తెలుగులో మరిన్ని చిత్రాలు తీయడానికి సిద్ధమవుతానన్నారు. కమెడియన్ సప్తగిరి మాట్లాడుతూ -బ్రహ్మానందం పోలీస్ డాగ్ ట్రైనర్‌గా నటిస్తే, ఆయనకు అసిస్టెంట్‌గా సినిమాలో నటించానన్నారు. ఓ మంచి పాత్ర ఈ చిత్రంలో దొరికిందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్ చాప్లాట్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.