రాక్షస పాత్రే నాయకుడిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ కథానాయకులలో జానపద చిత్రాలతోపాటు పౌరాణిక చిత్రాలలో నటించే సత్తా వున్న హీరో ఎవరు అని ఇపుడు వున్న ప్రేక్షకులకు ఓ ప్రశ్న తొలుస్తునే వుంటుంది. దానికి సమాధానం చెప్పడానికి రానా ఓ పౌరాణిక చిత్రంలో నటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గతంలో ఎక్కడికివచ్చినా ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ భారీ డైలాగ్‌ను చెప్పి ఓకె అనిపించుకున్న ఆయనకు ఈ పౌరాణిక చిత్రం కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి! సీనియర్ దర్శకుడు, రుద్రమదేవి వంటి చిత్రాలను రూపొందించిన గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందిస్తుండడం విశేషం. ఇప్పటివరకు ఆయన 13 చిత్రాలకే దర్శకత్వం వహించినా, ఒక్కొక్కటీ ఒక్కొక్క ఆణిముత్యంగా ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అనుష్క కథానాయికగా నటించిన భారీ పీరియాడిక్ చిత్రం రుద్రమదేవి తరువాత ఆయన ఎటువంటి చిత్రం రూపొందించలేదు. తొలినాళ్ళల్లో బాలలతో రామాయణం లాంటి పౌరాణిక చిత్రాన్ని నిర్మించిన ఆయన, ఇపుడు దగ్గుబాటి రానా కథానాయకుడిగా ‘హిరణ్యకశిప’ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు. త్వరలో చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. రానా- గుణశేఖర్ కాంబినేషన్‌లో రూపొందించనున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో అంచనాలు ప్రారంభమయ్యాయి. సో.. పౌరాణిక చిత్రంలో రానా ఎంతవరకు విజయం సాధిస్తాడో వేచి చూడాల్సిందే!