ఆ మజా ఉంటుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్, సప్తగిరి, మధునందన్ లీడ్‌రోల్స్‌లో కొత్త దర్శకుడు శ్రీనాథ్ బాదినేని తెరకెక్కిస్తోన్న సినిమా -తాగితే తందానా. రైట్ టర్న్ ఫిలిమ్స్‌పై వి మహేష్, వినోద్ జంగపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిమ్రాన్ గుప్తా, రియా హీరోయిన్లు. పాట, ప్యాచ్ వర్క్ వినా షూటింగ్ పూరె్తైంది. పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఆవిష్కరించింది. దర్శకుడు మారుతి, నిర్మత దామోదర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ -్ఫస్ట్‌లుక్ ఎగ్జైటింగ్ అనిపించింది. కొత్త కానె్సప్ట్‌తో వస్తోన్న చిత్రమిది. ఆదిత్, మధు, సప్తగిరిల లుక్ ఆసక్తికరంగా ఉంది. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ -కొత్తవాళ్లు సరైన ప్లానింగ్‌తో వస్తే డెఫినెట్‌గా విజయం అందుకుంటారు అన్నారు. హీరో ఆదిత్ మాట్లాడుతూ -నేను చాలా చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశా. ఇప్పుడు శ్రీనాధ్‌తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది అన్నారు. సప్తగిరి మాట్లాడుతూ -హీరోగా మంచి సినిమాలొస్తే చేద్దామనుకుంటున్న టైంలో శ్రీనాథ్‌తో సినిమా చేశాను. ఫుల్త్ లెంగ్త్‌కామెడీ రోల్ నాది. నిర్మాతలు బాధ్యతగా సినిమా చేశారు అన్నాడు. మధునందన్ మాట్లాడుతూ -తాగి తందనాలాడితే ఎంత మజా ఉంటుందో సినిమా అలాంటి కిక్కే ఇస్తుంది అన్నాడు. చిత్ర దర్శకుడు శ్రీనాథ్ మాట్లాడుతూ -ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కోపరేషన్ మర్చిపోలేను. కథకి తగ్గ టైటిల్ దొరికింది. తాగి తందనాలాడితే ఎలాంటి అనర్థాలు తప్పవో సినిమాలో చూస్తారు అన్నాడు. నిర్మాత వినోద్ జంగపల్లి మాట్లాడుతూ -ప్లానింగ్‌తో అనుకున్న టైములో సినిమా పూర్తి చేశాం. దర్శకుడు శ్రీనాథ్‌కు ఇదో బెంచ్‌మార్క్ సినిమా. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన త్వరలోనే సినిమాను థియేటర్లకు తెస్తాం అన్నారు.