చిరు టైటిల్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ హీరో మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా దాదాపు సగంపైగా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమా తరువాత మహేష్ తన తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టాడట. ప్రముఖ తమిళ క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. సోషల్ అవేర్‌నెస్ అంశంతో తెరకెక్కే ఈ సినిమాకు చిరంజీవి సినిమా టైటిల్ పెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అప్పట్లో చిరంజీవి హీరోగా నటించిన సంచలన చిత్రం ‘చట్టానికి కళ్ళులేవు’ అనే టైటిల్‌ను పెడుతున్నట్టు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుందట. త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి.