పాటల రుద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా అజిత్ క్రియేషన్స్ పతాకంపై బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో టి.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రుద్ర ఐ.పి.ఎస్’. ఈ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, రాజ్‌కృష్ణ చక్కగా నటించాడని, తప్పకుండా ఈ సినిమాతో తనకు హీరోగా మంచి పేరు వస్తుంది. ఘంటాడి కృష్ణ అందించిన సంగీతం బాగుందని, చిన్న సినిమాల శ్రేయస్సుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, త్వరలోనే మినీ థియేటర్స్ ఏర్పాటవుతాయని, ఈ సినిమాకు థియేటర్ల సమస్య రాకుండా చూసుకుంటామన్నారు. దర్శకుడు బాల్‌రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇదని, అవినీతిని, అక్రమాలను అరికట్టే పవర్‌ఫుల్ పోలీసు పాత్రలో రాజ్‌కృష్ణ చక్కగా నటించారని అన్నారు.
హీరో రాజ్‌కృష్ణ మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో వున్న తాను సినిమామీద ఆసక్తితో హీరోగా నటిస్తూ నిర్మాతగా మారానని, మంచి కథతో రూపొందిన చిత్రమిదని, తప్పకుండా అందరి సహకారం కావాలని అన్నారు.