క్రైమ్/లీగల్

మాజీ ఐఏఎస్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమ పెట్టుబడుల కేసులో మాజీ ఐఎఎస్ అధికారి డి మురళీధరరెడ్డికి ఊరట లభించింది. ఆయనపై తదుపరి విచారణను నిలిపివేస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది.
వెయిటేజీని సమర్థించిన హైకోర్టు
మెడికల్ పీజీలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 21,జీవో 22లను హైకోర్టు సోమవారం నాడు సమర్థించింది. ఈ జీవోలను సవాలు చేస్తూ డాక్టర్ ఎం వసుచరణ్ రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటీషన్లను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ కె విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు.
ఎస్సెల్ పిటీషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేసే విషయంలో తమతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాలని ఎస్సెల్- జీ గ్రూప్ సుభాష్ చంద్ర ఫౌండేషన్ దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఆగ్రి గోల్డ్ ఆస్తులను ఉమ్మడిగా కొనుగోలు చేసేలా రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఎస్సెల్ గ్రూప్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్ వారి విజ్ఞప్తిని తిరస్కరించింది.
పోలీసులపై విచారణకు స్టే విధించిన హైకోర్టు
జర్నలిస్టు హేమచంద్ర పాండే, మావోయిస్టు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ ఎన్‌కౌంటర్లపై పోలీసులపై విచారణ జరపాలని క్రింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ సోమవారం హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి విచారణ జరపవద్దని అందులో పొందుపరిచింది. ఎన్‌కౌంటర్ అనంతరం హేమచంద్ర భార్య బబిత, రాజ్‌కుమార్ భార్య పద్మాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారణ జరిపిన ఆసీఫాబాద్ జిల్లా న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పును వెలువరించింది.
న్యాయవివాదాల పరిష్కారానికి ఆన్‌లైన్
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయవివాదాల పరిష్కారానికి , స్పష్టతకు ఆన్‌లైన్ వ్యవస్థను తీసుకువస్తామని నగర కార్పొరేషన్ కమిషనర్ బి జనార్దనరెడ్డి హైకోర్టుకు తెలిపారు. జస్టిస్ ఎం ఎస్ రామచంద్రరావు ముందు సోమవారం నాడు హాజరైన కమిషనర్ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. కూల్చివేతలు, ఇతర అంశాలపై పలు న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాల అమలులో జాప్యంపై బెంచ్ ప్రశ్నించినపుడు కమిషనర్ ఈ హామీని చ్చారు. మరో 3 వారాల తర్వాత ఈ ప్రక్రియ ఎంత వరకూ వచ్చిందో స్పష్టంగా తెలపాలని న్యాయమూర్తి ఆదేశించారు.