బిజినెస్

ఏడాదికోసారి కోల్డ్ స్టోరేజ్‌ల లైసెన్సుల రెన్యూవల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 29: రాష్ట్రంలో ఇకపై ఏడాదికి ఒకసారి కోల్డ్ స్టోరేజీల అనుమతులను రెన్యూవల్ చేయనున్నట్లు ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. గుంటూరులోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోల్డ్ స్టోరేజీలలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు. ఇందులో భాగంగానే నవంబర్‌లో ఉన్నత స్థాయి కమిటీని నియమించి కమిటీ ఇచ్చే సిఫారసులను అమలు చేస్తామని తెలిపారు. నూతన కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి విద్యుత్, అగ్నిమాపక, కార్మిక శాఖలు ఎన్‌ఒసి ఇచ్చిన తర్వాత మాత్రమే మార్కెటింగ్ శాఖ అనుమతిస్తుందని స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు శీతల గిడ్డంగుల యాజమాన్యాలు లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకు నిర్మాణంతోపాటు స్మోక్ డిటెక్టర్లు, సిసి కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. త్వరలో అగ్నిమాపక శాఖకు కార్బన్‌డైఆక్సైడ్ ట్యాంక్‌ల కొనుగోలుకు చర్యలు చేపట్టనున్నట్లు కూడా చెప్పారు. అగ్ని ప్రమాదాల అనంతరం స్టోరేజీ యాజమాన్యాలే రైతులకు 50 శాతం నష్ట పరిహారం చెల్లించేలా నిబంధనలు రూపొందిస్తామన్నారు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు నష్ట పరిహారం అందించడంలో జాప్యం జరుగుతున్నందున, ఇకపై మూడు నెలల్లోగా నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా, తాము ప్రతిపక్షాలకు చెందిన నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం లేదని, ఇదంతా వారి అభూతకల్పనేనని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి పుల్లారావు సమాధానమిచ్చారు.

చిత్రం.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు